Rating: 3.5/5

రివ్యూ: యాత్ర
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: మమ్ముట్టి, జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్‌, సచిన్‌ ఖేడేకర్‌, పోసాని కృష్ణమురళి, తోటపల్లి మధు, కళ్యాణి, ఆశ్రిత తదితరులు
సంగీతం: కె
కూర్పు: ఏ. శ్రీకర్‌ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌
నిర్మాతలు: విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి
రచన, దర్శకత్వం: మహి వి. రాఘవ్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 08, 2019

వైఎస్‌ఆర్‌ బయోపిక్‌గా ప్రచారం పొందిన 'యాత్ర' నిజానికి పూర్తి బయోపిక్‌ కాదు. వైఎస్‌ఆర్‌ జీవితంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని మాత్రమే చూపిస్తుందీ చిత్రం. అలాగని ఆ ఘట్టాన్ని యథాతథంగా వాస్తవాలకి దగ్గరగా చూపించడం కాకుండా... వాస్తవ పాత్రలు, సంఘటనలకి సినిమాటిక్‌ డ్రామా జోడించి... వైఎస్‌ఆర్‌ అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. ఒక విధంగా ఇది వైఎస్‌ఆర్‌ బయోపిక్‌ అనడం కంటే... దర్శకుడు మహి వి. రాఘవ్‌ ఆయనకి ఇచ్చిన 'ట్రిబ్యూట్‌' (నివాళి) అనడం సబబేమో.

అధికార తెలుగుదేశం పార్టీ (సినిమాలో మనదేశం అన్నారు) మళ్లీ పవర్‌లోకి రావడం ఖాయమనిపించినపుడు, 'ఇప్పుడు కాకపోతే ఇక మళ్లీ గెలవలేం. రాజకీయాలు వదిలేయడం తప్ప' అని వైఎస్‌ రాజశేఖరరెడ్డి బలంగా భావించినపుడు... ముందస్తు ఎన్నికలకి ఏమాత్రం సిద్ధంగా లేని తన పార్టీని గెలిపించుకోవడానికి వైఎస్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం... 'పాదయాత్ర'. ఆ పాదయాత్ర చేపట్టడానికి ఆయనని ప్రేరేపించిన సంఘటనలు, ఆ పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకున్న ఉదంతాల సమాహారమే 'యాత్ర'.

'గెలవడం అసాధ్యం' అనే లెవల్‌ నుంచి ఆయన ఎలా గెలిచారు అనేది యాత్ర ఫోకస్‌ చేస్తుంది. ఆయన ప్రకటించిన ప్రతి ప్రజా సంక్షేమ పథకం వెనుక ఎలాంటి కారణాలు ఆయనని ప్రేరేపించి వుంటాయనేది దర్శకుడు మహి వి. రాఘవ్‌ తన ఆలోచనలతో డ్రామా నింపి వాటిని కథనంలో భాగం చేసాడు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితం నిజానికి మంచి 'బయోపిక్‌' మెటీరియల్‌గా పనికొస్తుంది. కానీ అదంతా వదిలేసి ఒక 'పాసివ్‌' ఎపిసోడ్‌ అయిన 'పాదయాత్ర'ని హైలైట్‌ చేసి, దాని మీదే పూర్తి సినిమా తీయడం ఆషామాషీ వ్యవహారం కానే కాదు. పాదయాత్ర పేరు చెప్పి దర్శకుడు మహి వి. రాఘవ్‌ 'రోప్‌ వాక్‌' చేసాడనే చెప్పాలి. ఏమాత్రం పట్టు తప్పినా అటు పొలిటికల్‌ ప్రాపగాండా సినిమాగానో, లేదా ఇటు ఒక నీరసమైన డాక్యుమెంటరీగానో మిగిలిపోయే ప్రమాదం వున్న కాన్సెప్ట్‌ ఇది.

ఎమోషన్స్‌ ఎంత పండితే, వాటితో ప్రేక్షకులు ఎంత కనక్ట్‌ కాగలిగితే సదరు దృశ్యాలు అంత పండుతాయి అనిపించే సన్నివేశాలు సుదీర్ఘంగా వున్నాయి. మమ్ముట్టి అద్భుతమైన అభినయానికి తోడు, ఆయా సన్నివేశాల్లో కనిపించిన సహజత్వం వాటిని చాలా ఎఫెక్టివ్‌గా తెరమీదకి తీసుకొచ్చింది. వృద్ధాప్య పించన్లు అందని వృద్ధులు తమ గోడు వెళ్లబోసుకునే సన్నివేశంలో 'ఊళ్లో పది మందికే నెలకి డెబ్బయ్‌ అయిదు రూపాయల పించను వస్తోంది. ఆ పది మందిలో ఒకరు పోతే మనకి ఆ డబ్బులొస్తాయని మరొకరి చావుకోసం ఎదురు చూడాల్సి వస్తోంది' లాంటి కదిలించే సంభాషణలు ఇన్‌స్టంట్‌గా టచ్‌ చేస్తాయి