వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని తేలింది. మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు ఆయనది హత్యేనని తేల్చారు. వివేకా శరీరంపై ఏడు కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు. తలపై పదునైన ఆయుధంతో కొట్టినట్టు గాయాలున్నాయి.

 

వైఎస్ వివేకాది సహజ మరణం కాదని పోలీసులు కూడా వెల్లడించారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలు కూడా దొరికాయని
ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఎవరు హత్య చేశారన్నది గుర్తిస్తామని ఎస్పీ చెప్పారు.