నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవడంతో ఇప్పటి వరకు అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన వారు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న లోకేష్ నియోజకవర్గంలోని నేతలను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు.

ఈ నేపథ్యంలో మంగళగిరిలో నారా లోకేష్‌ మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను కలిశారు. లోకేష్ స్వయంగా పోటీకి దిగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మీ నాన్న(చంద్రబాబు) టికెట్ ఇస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేశారని లోకేష్ వద్దే కమల వ్యాఖ్యానించారు. తమ వియ్యంకుడు హనుమంతురావుకు గానీ, కుటుంబంలో మరొకరికి గానీ టికెట్‌ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని… ఆ హామీతోనే పార్టీలో చేరామని… కానీ ఇప్పుడు మీరే నేరుగా బరిలో దిగడం మోసం చేయడం కాదా అని కమల ప్రశ్నించినట్టు తెలుస్తోంది

దాంతో లోకేష్‌ మీ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ అనగా…. అందుకు స్పందించిన కమల… అధికారంలో ఉన్నప్పుడే పద్మశాలీలకు ఏమీ చేయలేకపోయారు…ఇక అధికారం పోయాక ఏం చేస్తారని ప్రశ్నించడంతో లోకేష్ షాక్‌ అయ్యారని సమాచారం.