• 2020 పీఫా అండర్ -17 మహిళా ప్రపంచకప్ కు గ్రీన్ సిగ్నల్
  • భారత యువ మహిళా సాకర్ జట్టుకు సువర్ణావకాశం

 

ప్రపంచ క్రికెట్, హాకీ టోర్నీలకు మాత్రమే ఇప్పటి వరకూ ఆతిథ్యమిస్తూ వచ్చిన భారత్….ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో సైతం టోర్నీలు నిర్వహించడానికి ప్రాధాన్యమిస్తోంది.

గతంలో పీఫా అండర్ -17 యూత్ ప్రపంచకప్ ను విజయవంతంగా నిర్వహించిన భారత ఫుట్ బాల్ సమాఖ్య..2020లో జరిగే మహిళల అండర్ -17 ప్రపంచకప్ టోర్నీని సైతం నిర్వహించడానికి అనుమతి సంపాదించింది.

మియామీ వేదికగా ముగిసిన పిఫా సమావేశంలో అండర్ -17 మహిళా ప్రపంచకప్ ను నిర్వహించే అవకాశం భారత్ కు ఇస్తూ నిర్ణయం తీసుకొన్నారు. గత ఏడాది ఉరుగ్వే వేదికగా ముగిసిన 2017 పీఫా అండర్ -17 మహిళా ప్రపంచకప్ టోర్నీలో స్పెయిన్ విజేతగా నిలిచింది. మెక్సికోకు రెండు, న్యూజిలాండ్ మూడు, కెనడా నాలుగు స్థానాలు సాధించాయి.

ప్రపంచకప్ టోర్నీ ఏదైనా ఆతిథ్య దేశానికి మాత్రం…నేరుగా తనజట్టును బరిలోకి దించే వెసులు బాటు ఉంటుంది. ఈ అవకాశాన్ని భారత్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

భారత మహిళల అండర్ -17 జట్టు తొలిసారిగా ప్రపంచకప్ టోర్నీలో నేరుగా పాల్గొనే అవకాశం దక్కించుకోగలుగుతుంది.