చంద్రబాబుకు మరోసారి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్‌ కమ్మ ప్రదేశ్‌ అవుతుందని వ్యాఖ్యానించారు దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ. టీడీపీ మళ్లీ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని… కేవలం కమ్మ రాజ్యం మాత్రమే నడుస్తుందన్నారు. తాను తీసిన చిత్రం విడుదల కాకుండా అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నించడం సరైనది కాదన్నారు. ఎవరో లేఖ రాస్తే 
అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

అసలు తాను తీసిన సినిమాలో ఏముందో వారికి ఎలా తెలిసిందని నిలదీశారు. సినిమాలను అడ్డుకోవడమే ఎన్నికల కమిషన్‌ పనా అని మండిపడ్డారు. కనీసం సినిమాకు సంబంధించిన ఒక్క క్లిప్ అయినా ఈసీ చూసిందా అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందన్న అభిప్రాయాన్ని కలిగించే పనులు చేయవద్దన్నారు. సినిమాలో అభ్యంతరాలు ఉంటే సెన్సార్ బోర్డు స్పందిస్తుంది కానీ… ఎన్నికల సంఘానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు.

‘అనగనగ ఒక ముఖ్యమంత్రి’ అని టైటిల్ పెట్టగానే అది చంద్రబాబు గురించే అనుకుంటే ఎలా అన్నారు. తాను సినిమాను సెన్సార్ బోర్డు నిబంధనలకు లోబడే తీస్తామన్నారు. టీవీ చానళ్లలో ఇష్టానుసారం మాట్లాడుతున్నప్పుడు ప్రభావితం
కానీ ఓటర్లు సినిమా చూసి ప్రభావం అవుతారా అని ప్రశ్నించారు. మంచి పనులు చేసి ఉంటే నాయకులు సినిమాలకు ఎందుకు భయపడుతారని ప్రశ్నించారు.

అడ్డమైన లంగా పనులు చేసిన వారే తన సినిమాకు భయపడుతారన్నారు. తన సినిమా దెబ్బకే ఓడిపోయేంత బలహీనంగా రాజకీయ పార్టీ ఉందా అన్నారు. తన సినిమాను ఈసీ ఆపితే కోర్టుకు వెళ్తానని… రోజూ టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతానని
హెచ్చరించారు. అప్పుడు ఎన్నికల సంఘం ఆపుతుందా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఏం తప్పు చేసినా అడ్డుకునేందుకు భారతదేశంలో చంద్రబాబు కంటే పైన ఏ వ్యవస్థ లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఒక పెద్ద దొంగ అన్నారు. దేశం మొత్తం మీద ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైన అనుకుంటారా అంటూ వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కాకుండా మరొకరు ఉన్నారా అని పోసాని ప్రశ్నించారు. 15 ఏళ్లు పెళ్లాన్ని రోజూ కొట్టి… 15 ఏళ్ల తర్వాత దేవత అంటే ఎలా ఉంటుందో చంద్రబాబు తీరు కూడా అలాగే ఉందన్నారు పోసాని.