సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ…. ఎల్లో మీడియా ఆరేళ్ళ నుంచి తమ భుజాల మీద మోస్తున్న ఒక మాజీ పోలీసు అధికారి. చంద్రబాబు మీద విచారణ జరపమంటే సిబ్బంది లేరని చెప్పి…. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పై మాత్రం హడావిడిగా విచారణ చేసి అరెస్టు చేసి సంచలనం సృష్టించిన అధికారి.

కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసి తర్వాత పదవీ విరమణ చేసిన అధికారి. ఇంతవరకు ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఉద్యోగ విరమణ తర్వాత ప్రజాసేవ చేస్తానంటూ ఆంధ్రప్రదేశ్ లోని పల్లెల్లో తిరిగారు జె.డీ. లక్ష్మీ నారాయణ. ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ముఖ్యంగా రైతులు దగా పడుతున్నారంటూ సినిమా డైలాగులకంటే ఎక్కువ స్దాయిలో ప్రసంగించారు. తాను ప్రజాసేవ చేస్తాను తప్ప దానికి రాజకీయాలే మార్గం కాదని ప్రకటనలు గుప్పించారు.

దీంతో అమాయక తెలుగు ప్రజలు జె.డి లక్ష్మీ నారాయణలో మరో గాంధీ ఉన్నారేమోనని ఆశ పడ్డారు. తెలుగు ప్రజలకు జెడి. లక్ష్మీ నారయణ మేలు చేస్తారని భావించారు. అయితే తాను కూడా రాజకీయ నాయకుల వంటి వారేనని లక్ష్మీ నారయణ నిరూపించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరుతారని, భీమిలి నుంచి పోటీ చేస్తారని వార్త కథనాలు వచ్చాయి. ఇది దాదాపు ఖరారైపోయిందిని పార్టీ వర్గాలు కూడా పేర్కొన్నాయి. దీంతో .లక్ష్మీనారాయణ చేరికపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాలు ఊహంచని జె.డి. లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఆయన మార్చుకున్నారనే కంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వేసిన కొత్త ఎత్తుతో లక్ష్మీనారాయణ నిర్ణయం  మారిందంటున్నారు. ఇప్పుడు కొత్తగా లక్ష్మీనారాయణ జనసేన తీర్దం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరఫున భీమిలి నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇది కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి వ్యూహమేనని, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు లోపాయికారిగా కలిసారనడానికి ఇది ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రాజకీయ పార్టీలో చేరడానికి ఓ ఐపిఎస్ అధికారి ఇన్ని నాటకాలు, ఎత్తులు వేయలా అని తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు. 5 నెలలుగా రైతులు, కూలీలు, మధ్యతరగతి మానవులు…. అంటూ ప్రసంగాలతో ఊదరకొడుతున్న లక్ష్మీ నారాయణ అలాంటి కబుర్లే చెబుతున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరడాన్ని ఎద్దేవా చేస్తున్నారు. నారాయణ…. నారాయణా… ఈ మాత్రానికే ఇన్ని కబుర్లా..! అని విమర్శిస్తున్నారు.