శరీరంలోని కణాల లోపలకి  బ్లడ్ షుగర్ తగినంతగా వెళ్లలేకపోతే రక్తంలో షుగర్ లెవల్ పెరిగి  షుగర్ వ్యాధికి (diabtes )  దారి తీయవచ్చు. షుగర్ వ్యాధి భారత దేశాన్ని  పట్టి  పీడిస్తున ప్రధాన   వ్యాధి.  

1. మనం వంటల్లో సాధారణంగా వాడే దాల్చిన చెక్కలో కూడా అసాధారణ ఔషధ గుణాలున్నాయి.  దాల్చిన చెక్కలో సహజ సిద్ధంగా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసే గుణముంది.


2. అలాగే మనం ఎక్కువగా వాడే మెంతుల్లో కూడా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసే గుణం ఉంది. మెంతులు, మెంతి పిండి వాడితే షుగర్ వ్యాధిని నిరోధించవచ్చు. టీ చేసుకొని కూడా తాగవచ్చు.


3 . వేల సంవత్సారాల నుంచి చైనాలో బర్బరిన్ (Berberine) షుగర్ వ్యాధిని తగ్గించడానికి వాడుతున్నారు.  దీనిలోని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధిని నియంత్రించే గుణం వల్ల, షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా వాడచ్చు.  


4.  తగినంత నిద్రపోవడం ద్వారా బ్లడ్ షుగర్ నియంత్రించవచ్చు. నిద్ర లేమితో ఆకలి పెరిగి కావాల్సిన దానికన్నా  ఎక్కువ ఆహారాం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాక సరిగ్గా నిద్ర పోవకపోవటం వలన గ్రోత్ హార్మోన్ల విడుదల తగ్గి, కార్టిసాల్(cortisol ) లెవల్ పెరుగుతుంది. ఇవి రెండు బ్లడ్ షుగర్ నియంత్రించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. 


5. కావలసినంత నీరు త్రాగడం ద్వారా బ్లడ్ షుగర్ లెవల్ నియంత్రించవచ్చు. కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్న బ్లడ్ షుగర్ మూత్రం ద్వారా బయటకు పోతుంది. 


6.  కార్బో హైడ్రేట్స్ తగ్గించి, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవటం. 


7.   క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం వలన అనవసరమైన కొవ్వు కారిగాటమే కాకుండా కణాలకు షుగర్ గ్రహించే శక్తి ( insulin  sensitivity ) కూడా పెరుగుతుంది. వేగంగా నడవటం, పరుగెత్తడం, సైకిల్ తొక్కడం,డాన్స్,ఈత వంటి సాధారణ వ్యాయామాలు చేస్తే చాలు. 

      పైన చెప్పిన విధంగా చేయటంవల్ల షుగర్ వ్యాధిని పూర్తిగా నిరోధించి,  ఆ వ్యాధివల్ల వచ్చే  శారీరక, మానసిక, ఆర్ధిక సమస్యల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.