న్యూఢిల్లీ: భారతరత్న, క్రికెట్ దేవుడు,  సచిన్ టెండూల్కర్ తన ప్రపంచకప్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. తాజాగా ముగిసిన ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాళ్లకు అందులో చోటు కల్పించాడు. సచిన్ కలల జట్టులో మొత్తం ఐదుగురు టీమిండియా క్రికెటర్లు ఉన్నా, ధోనీకి చోటు దక్కకపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. సచిన్ తన ప్రపంచకప్ ఎలెవన్ జట్టుకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలకు జట్టులో చోటు లభించింది.  టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి  జట్టులో చోటు లేక పోవడం ఆశ్చర్యకరమైన  విషయం. అతడికి బదులుగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టోను తీసుకున్నాడు. 
ఐసీసీ ఇటీవల ప్రకటించిన ప్రపంచకప్ 2019 ఎలెవన్ జట్టులో రోహిత్ శర్మ, బుమ్రాలకు మాత్రమే చోటు కల్పించింది. సచిన్ మాత్రం ఏకంగా ఐదుగురికి చోటివ్వడం గమనార్హం.
 
    సచిన్ ప్రపంచకప్ 2019 ఎలెవన్ జట్టు: రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, షకీబల్ హసన్, బెన్‌స్టోక్స్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, జోఫ్రా అర్చర్, జస్ప్రీత్ బుమ్రా.