బీజేపీ పార్టీ ద్వారా నామినెట్ అయిన రాకేష్ సిన్హా రాజ్య సభలో "ది పాపులేషన్ రెగ్యులేషన్ బిల్, 2019 " ప్రవేశ పెట్టాడు.  ఈ బిల్ ప్రకారం ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు, ఎంపీ, ఎమ్మెల్యే, లేక స్థానిక సంస్థలలో ఎన్నిక కావటానికి అర్హత కోల్పోతారు. ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది  వున్నా వారికి ప్రభుత్వం అందించే సౌకర్యాలలో కోత విధించి, చట్టం పాటించిన వారికి ప్రోత్సాహాలు అందించే విధంగా బిల్ ప్రవేశపెట్టబడింది. అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు కూడా ఇద్దరికన్నా ఎక్కువమందిని కంటే వారికి కూడా ప్రభుత్వ సౌకర్యాలలో , రుణాలలో  కోత  విధిస్తారు. వారికి రుణాల మీద వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి.