సదావర్తి భూములపై విచారణ జరిపించాలి  - ఎమ్మెల్యే ఆళ్ల 

అమరావతి: సదావర్తి భూములపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.  రోశయ్య హయములోనే భూములు ఆం.ప్ర. ప్రభుత్వానివని తేలిందని,  చంద్రబాబు బినామీలు చెన్నైలో భూములు కొన్నారని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మారని కోర్టు కూడా మొట్టికాయలు వేసిందన్నారు. భూముల అమ్మకంపై వాస్తవాలు బయటికి రావాలన్నారు. సదావర్తి భూములపై విజిలెన్స్‌ విచారణ చేయించాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సదావర్తి భూములపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు.