ముంబయి: చంద్రబాబు హాయములో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) అధికార ప్రతిపక్షాలమధ్య యుద్ధ వాతావరణాన్ని సృస్టించాయి.  గత కొన్నిరోజులుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు  సమీక్షించేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఖండిచిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పుడు ప్రముఖ  కార్పొరేట్ రేటింగ్ సంస్థ ఫిచ్ ఇటువంటి చర్యలు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని  హెచ్చరించింది. సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఉత్పత్తి సంస్థల నగదు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయని ఫిచ్‌ అభిప్రాయపడింది.ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఎలను విజయవంతంగానే పునఃసమీక్షించినప్పటికీ.. విద్యుత్ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఫిచ్ తెలిపింది. ఈ చర్యలతో ఆయా సంస్థలకు కొన్ని పరిమిత రుణ సంస్థలు అందించే బాండ్ల విలువ తగ్గిపోతుందని ఫిచ్‌ హెచ్చరించింది