హిందీలో 'జెర్సీ' 

తెలుగులో మంచి టాక్ తెచ్చుకున్న 'జెర్సీ'  సినిమాని  పొరుగు భాషల్లో రీమేక్ చేసేందుకు ఓ ఇద్దరు అగ్ర నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. తొలిగా జెర్సీ హిందీ భాషలో  సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేతలతో కలిసి టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు- అల్లు అరవింద్ జోడీ నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ లేదా వరుణ్ ధావన్ ని హీరోగా ఎంచుకునే ఆలోచన చేస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే జెర్సీ హిందీ వెర్షన్ క్రేజీ ప్రాజక్టు అవుతుంది.