ముఖ్యమంత్రి పీఏ నన్న వ్యక్తి అరెస్ట్ 

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పీఏ నంటూ మదురై ప్రభుత్వ అతిథి భవనంలో బసచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. మదురై జిల్లా రెవెన్యూ అధికారి, మదురై తహసీల్దార్లకు శనివారం ఫోన్‌ చేసిన వ్యక్తి తాను ముఖ్యమంత్రి పీఏ రాజశేఖర్‌ మాట్లాడుతున్నాని పేర్కొని, మదురైలో జరిగే వివాహానికి వచ్చానని, తనకు ప్రభుత్వ అతిథి గృహంలో బస చేసేందుకు గది కేటాయించాలని చెప్పాడు. దీంతో ఆయనకు మదురై ఉన్న  ప్రభుత్వ అతిథి గృహంలో బస ఏర్పాటు చేశారు.  ఆ గదిలో కుటుంబ సభ్యులతో ఆ వ్యక్తి బస చేశారు. మదురై  తహసీల్దారు సెల్వరాజ్‌ గ్రామ నిర్వహణ అధికారి జగదీష్‌ కుమార్‌తో వెళ్లి విచారించగా, ఆ వ్యక్తి తీరుపై అనుమానం కలిగింది. తహసీల్దారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని స్టేషన్‌కు తీసకువెళ్లి విచారించగా సీఎం పీఏను అంటూ బుకాయించిన ఆ వ్యక్తి తిరుప్పూర్‌ జిల్లా మడత్తుకుళం కని యూర్‌ గ్రామానికి చెందిన సంతోష్ కుమార్‌ అని తెలిసింది. పోలీసులు  కేసు నమోదు చేసి రిమాండ్‌ నిమిత్తం జైలుకు తరలించారు.