బెంగళూరు: చిత్ర విచిత్ర మలుపులతో సాగుతున్నకుమారస్వామి ప్రభుత్వానికి, విశ్వాస పరీక్ష నేపథ్యంలో హైడ్రామా కొనసాగుతోంది. ఈ విషయంలో కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా  కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి రాసిన లేఖలో, రేపు మధ్యాహ్నం 1.30 లోపు మెజారిటీని నిరూపించుకోవాలని సూచించారు. విశ్వాస పరీక్ష  ఆలస్యం చేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించిన బీజేపీ అసెంబ్లీలో ధర్నాకు దిగటమే కాక,  గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేసింది. ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్ ఇవాళే విశ్వాస పరీక్ష పూర్తి చేయాలని స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే ఈ విషయంలో స్పీకర్‌ను ఆదేశించే అధికారం గవర్నర్‌కు లేదని కాంగ్రెస్ వాదించింది. ఈ నేపథ్యంలో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.