బెంగళూరు: బీజేపీ తనకు రూ.5 కోట్లు ఆశచూపిందన్న  కోలార్ జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ చేసిన ఆరోపణలను కర్ణాటక బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఖండించారు. శ్రీనివాస్ గౌడ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రవేశపెడతామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ పాల్పడుతోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు తప్పుడు  ఆరోపణలని  బీజేపీ నేత ఆర్.అశోక్ అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు  కాంగ్రెస్ పాల్పడినప్పుడు ఈ సిద్ధాంతాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.  హోటళ్లలో బసలు, విమానం టిక్కెట్లు, ఇక్కడ్నించి అక్కడించి జనాలను తరలించినప్పుడు డబ్బులు ఎవరు ఇచ్చారో చెప్పాలన్నారు. అకస్మాత్తుగా ఇప్పుడు వారికి సిద్ధాంతాలు గుర్తుకు వచ్చాయా  అన్నారు