గుంటూరు:   లోకేష్ టార్గెట్‌గా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ విమర్శలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఐటీ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సతీష్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై రెండు రోజుల్లో సీఎం జగన్‌ను కలుస్తానని, కేంద్రంతో మాట్లాడి సీబీఐ విచారణ కోరతామని చెప్పారు. లోకేష్ కారణంగానే టీడీపీ తీవ్రంగా ఓడిపోయిందని ఆరోపించారు. లోకేష్ వల్లే టీడీపీ ఓడిపోయిందని,   లోకేష్ చేసిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. లోకేష్ వల్ల టీడీపీ నేతలంతా బీజేపీలోకి వెళ్తున్నారు’’ అని అన్నం సతీష్‌ పేర్కొన్నారు.త్వరలోనే పార్టీ పూర్తిగా ఖాళి అవుతుందని జోస్యం చెప్పారు.