ప్రకాశంలో టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య గొడవలు  

ఒంగోలు: టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య రాళ్లు, కొడవళ్లతో  పరస్పరం దాడులు జరిగిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.  గతకొద్దికాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తూ ఒకరి మీద ఒకరు దాడులు జరుపుకుంటున్నారు.  టంగుటూరు మండలం లక్ష్మక్కపాలెం గ్రామంలో శుక్రవారం టీడీపీ-వైసీపీ వర్గీయులు రాళ్లు, కొడవళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.  సమచారమందుకున్న పోలీసులు వెంటనే ఆగ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అలాగే గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.