.ఇసుక వివాదంలో యువకుడి హత్య    

నిజామాబాద్: ఇసుక అక్రమ తవ్వకాల్లో విభేదాల కారణంగా  ట్రాక్టర్ తో ఢీకొట్టి యువకుడిని హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నాగారం కెనాల్ వద్ద శుక్రవారం ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. అయితే ఈ యువకుడిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపడం స్థానికంగా  సంచలనం కలిగించింది. యువకుడి హత్యకు ఇసుక అక్రమ తవ్వకాల్లో విభేదాలే కారణమని స్థానికుల సమాచారం  . పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.