ముంబయి: ‘నేను ఓ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా. దాన్ని ఈ ప్రపంచం కనిపెట్టలేకపోయింది’ అంది  బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా. ఈ ముద్దుగుమ్మ  చిత్ర పరిశ్రమకు వచ్చి తొమ్మిదేళ్లు కావొస్తున్నా ప్రేమ, జీవితం గురించి మీడియా ఎదుట అంతగా మాట్లాడలేదు. కాగా, ఆమె తాజాగా ఓ ఛాట్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘చిత్ర పరిశ్రమకి సంబంధించిన వారితో డేటింగ్‌పై మీ అభిప్రాయం ఏంటి?’ అని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను మంచి కుర్రాడిని ప్రేమించాలనేది నా తల్లిదండ్రుల కోరిక. కానీ, చిత్ర పరిశ్రమలో అలాంటి వారు లేరు. గతంలో నేను ఇండస్ట్రీకి చెందిన ఓ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా.  కానీ ఈ ప్రపంచం దాన్ని  కనిపెట్టలేకపోయింది’ అని చెప్పారు.