పంజాబ్: కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రికి పంపిన రాజీనామా లేఖను అమరీందర్ సింగ్ అంగీకరించారు. అంతేకాకుండా నవజ్యోత్ సింగ్ రాజీనామా లేఖను గవర్నర్‌‌కు పంపించారు. గత కొద్దికాలంగా పంజాం సీ ఏం  అమరీందర్ సింగ్, సిద్ధుల మధ్య జరుగుతున్నా అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది.  జూన్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్ధూకు విద్యుత్ శాఖ కేటాయించారు. దీనిపై సిద్ధూ అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా గత లోక్‌సభ ఎన్నికల్లో తన భార్యకు ఎంపీ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. తన భార్యకు టికెట్ రాకుండా అమరీందర్ సింగ్ అడ్డుకున్నారని భావిస్తున్న సిద్ధూ.. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధూ రాజీనామా లేఖను అమరీందర్ సింగ్ అంగీకరించారు.