నిర్మల్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. ఫించన్ల పెంపును హర్షిస్తూ... నిర్మల్ పట్టణంలోని నాయిడివాడలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌ పర్సన్ విజయలక్ష్మితోపాటు పలువురు కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆయా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.