బెంగళూరు, : డబ్బుకోసమే తమ పార్టీ ఎమ్మె ల్యే హెచ్‌.విశ్వనాథ్‌ బీజేపీకి అమ్ముడుపోయారంటూ జేడీఎస్ కు చెందిన మంత్రి సా.రా.మహేశ్‌ శాసనసభలో తీవ్ర ఆరోపణ చేశారు.   పిల్లలపై ఒట్టేసి మరీ చెబుతున్నానన్న  మం త్రి ఆరోపణ సభలో తీవ్ర కలకలం సృష్టించింది. బలపరీక్ష చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి, నాలుగు నెలలక్రితం హెచ్‌.విశ్వనాథ్‌ అసంతృప్తితో ఉండడంతో స్వయంగా తానే మాట్లాడించానన్నారు. ఎన్నికల్లో చేసిన అప్పు రూ.28కోట్ల దాకా ఉందని ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని బాధపడ్డాడన్నారు.  అయితే ఒక్కసారిగా అంత మొత్తం తాను ఇవ్వలేనని నెలసరి కొంత మొత్తం సర్దుతానని భరోసా ఇచ్చానన్నారు. ఈలోపు ఏం జరిగిందో తెలియదు కానీ నెలసరివాయిదా మొత్తం ఇచ్చేందుకు ఫోన్‌ చేయగా అప్పటికే ఆయన ముంబైలో ఉన్నట్టు తెలిసిందన్నారు. విశ్వనాథ్‌ అసంతృప్తికి తాను కార ణం కాదని స్పష్టం చేశారు. తన కారణంగా అసమ్మతి బాట పట్టినట్టు విశ్వనాథ్‌ చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు. ఈ విషయం మంత్రి జీటీదేవేగౌడకు కూడా తెలుసునని ఆయన చెప్పారు. . శాసనసభలో  లేని సమ యంలో తనపై మంత్రి ఆరోపణలు చేయడాన్ని ముంబై హోటల్‌లో ఉన్న జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌.విశ్వనాథ్‌ తీ వ్రంగా ఖండించారు. అయినా తాను సభ లో లేని సమయంలో ఈ విషయం మాట్లాడేందుకు మంత్రి మహేశ్‌కు అనుమతి ఇవ్వడాన్ని బట్టి దురుద్దేశ్యం వ్యక్తం అవుతోందన్నారు. మంత్రి మహేశ్‌పై పరువునష్టం దావా వే స్తానని ప్రకటించారు. ఇదిలా ఉండగా జేడీఎస్‌ ఎమ్మెల్యే విశ్వనాథ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి సా. రా. మహేశ్‌ క్షమాపణలు చెప్పాలని బీజే పీ డిమాండ్‌ చేసింది. విశ్వనాథ్‌ సజ్జనుడని వెనకేసుకు రావడం విశేషం.  
 ఎమ్మె ల్యేల రాజీనామాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారంటున్న  బీజేపీ ఇటువంటి విషయాలలో జే‌డి‌ఎస్, కాంగ్రెస్సులను తూర్పార పడుతూనే ఉంది.