ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో సింధు ఓడిపోయింది. సెమీ ఫైనల్ దాకా మంచి ప్రతిభను కనబరచిన ఆమె, తన ఫామ్ ఫినల్స్ లో కొనసాగించలేక పోయింది. రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది.  యమగుచి చేతిలో పరాజయం పాలైంది. 15-21, 16-21  స్కోర్ తేడాతో సింధు ఓడిపోయింది. ఫైనల్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సింధు అంచనాలను అందుకోలేకపోయింది. జపాన్ షట్లర్ ఆట ముందు తేలిపోయింది. ఆరంభంలో పోటీ ఇచ్చిన.. తర్వాత తడబడింది. మ్యాచ్‌ను చేజార్చుకుంది.