హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం నేత్రానందంగా జరుగుతోంది. ఆదివారం తెల్లవారు జామునుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆషాఢమాసంలో జరిగే బోనాలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక  ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది  లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.  దీంతో క్యూలన్నీ కిటకిటలాడుతున్నాయి.   సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వద్ద కొంత మంది పోలీసులు  అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. పోలీసులు తమ బంధువులకు స్పెషల్ దర్శనం ఇప్పిస్తున్నారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోనం ఎత్తుకొస్తున్న మహిళలు క్యూ లైన్లలోనే వేచి చూస్తున్నారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లొనే నిలుచున్నారు.