బెంగళూరు: ముఖ్యమంత్రి కుమారస్వామి కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీ బలపరీక్షను ఎదుర్కోనున్న తరుణంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా బీఎస్‌పీ ఎమ్మెల్యే ఓటు వేస్తారని తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు తమ ఎమ్మెల్యేకి ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. దీనికి కొద్ది సేపటికి ముందే కర్ణాటక అసెంబ్లీలో ఏకైక బీఎస్‌పీ ఎమ్మెల్యే అయిన మహేష్ హాజరుకాబోనని ప్రకటించారు. అయితే, ఆయన ప్రకటన చేసిన కొద్దిసేపటికే మాయావతి ట్వీట్ చేశారు. తమ ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరై కుమారస్వామికి మద్దతుగా ఓటువేస్తారని, ఈ మేరకు ఎమ్మెల్యే మహేష్‌కు ఆదేశాలిచ్చానని ఆమె ట్వీట్ చేశారు.