బడ్జెట్ రోజు నుంచి ఇప్పటిదాకా మదుపరులు  దాదాపు ఆరు లక్షలకోట్లు నస్టపోయారు. విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులు ఉపసంహరించటం ఒక వేపు , కంపెనీల నిరాశాజనకమైన ఫలితాలు ఇంకొక వైపు , ఆర్ధిక మందగమన భయాలు వంటి పలుకారణాల వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ జరగడంతో అమ్మేవాళ్లే తప్ప కొనేవాళ్లూ తక్కువ అవడంతో  మార్కెట్లు విపరీతమైన వత్తిడికి లోనయ్యాయి. బడ్జెట్ లో ప్రస్తావించిన సూపర్ రిచ్ టాక్స్ తో  విదేశీ మదుపరులు మార్కెట్ నుంచి నిష్క్రమించడం ప్రారంభించారు. మూడింట రెండువంతుల నిఫ్టీ స్టాక్స్ వాటి అల్ టైమ్ హై నుండి 10-70 పర్సెంట్ డిస్కౌంట్లో లభిస్తున్నాయి.