బాత్‌రూములు  కడిగేందుకే నేను ఎంపీనయ్యానా?అంటూ  పార్లమెంట్ సభ్యురాలు సాథ్వి ప్రజ్ఞా సింగ్  చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.  ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ్‌ భారత్‌లో పాల్గొనాలని కోరిన జనాలపై సాధ్వి ప్రజ్ఞా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మరుగుదొడ్లను కడిగేందుకు నేను పారిశుధ్య కార్మికురాలిని కాదని, టాయిలెట్లను పరిశుభ్రం చేయడానికి తాను పార్లమెంట్‌కు ఎన్నికవ్వలేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలు, మున్సిపల్ అధికారులతో పనులు పనిచేయించుకోవాలని సూచించారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  సాధ్వీ ఇటీవల తన నియోజక వర్గం భోపాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. ఆ ప్రాంత డ్రైనేజ్ సమస్యలు కూడా తెలిపారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివరణ కోరుతూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సాధ్వీని ఆదేశించారు.