అమరావతి: అసలే నిధుల నిధుల లేమితో కటకటలాడుతున్న అమరావతి నిర్మాణానికి మరో అవరోధం ఎదురైంది. ప్రపంచ బ్యాంకు బాటలోనే అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టు రుణ ప్రతిపాదనను ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ) కూడా ఉపసంహరించుకుంది. రాజధాని నిర్మాణానికి రూ.1400 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఏఐఐబీ ఇప్పుడు వెనక్కి తగ్గడానికి కారణాలేంటో అర్థం కావడంలేదు. సంప్రదింపుల ద్వారా సమగ్ర వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.  అమరావతి సస్టెయినబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూట్‌షనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్‌ నిరాకరించిన కొద్ది రోజులకే ఏఐఐబీ కూడా రుణం ఇవ్వలేమని ప్రకటించడం గమనార్హం. ఏదేమైనా జగన్ సర్కారుకి ఇది పెద్ద దేబ్బే!