అమరావతి: ఎస్సీ ఎస్టీ, బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం మేర రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్ష తెదేపా జీర్ణించుకోలేకపోతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి విమర్శించారు.  శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ‘ఖబడ్దార్‌ చంద్రబాబు’ అంటూ నేరుగా ప్రతిపక్షనేతను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉండగా కనీసం తమ గోడు చెప్పుకునేందుకు కూడా అవకాశం కల్పించలేదని.. తాము ఆందోళన చేస్తే బయటకు గెంటేశారని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేస్తే ఖబడ్దార్‌ అంటూ కోటం రెడ్డి శాసనసభలో పదేపదే వ్యాఖ్యలు చేశారు. దీంతో స్పీకర్ మైక్ కట్ చేశారు.