బిజినెస్ డెస్క్ : ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ షామీ ఐదో వార్షికోత్సవ సందర్భంగా పలు ఫోన్లపై రాయితీ ఇస్తోంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్లు అయిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు, ఎంఐ.కామ్‌లోనూ జులై 25వ తేదీ వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌పై రూ.3,300 వరకూ తగ్గింపును అందిస్తుండగా, కొన్ని ఫోన్లపై ఏకంగా రూ.7,500 వరకూ రాయితీ ఇస్తోంది. ఎస్‌బీఐ బ్యాంకు ఆఫర్‌ కింద మరో 5శాతం అదనంగా రాయితీని పొందవచ్చు. 

* రెడ్‌మి 7; 2జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న మొబైల్‌ ఇప్పుడు రూ.7,499లకే లభించనుంది. ఇక 3జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ మొబైల్‌ను రూ.8,499లకే షామీ అందిస్తోంది. రెండు ఫోన్లపై రూ.500 తగ్గింపును ప్రకటించింది. 
* ఇక రెడ్‌మి వై3 3జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న మొబైల్‌ రూ.8,999 కాగా, 4జీబీ ర్యామ్‌+64జీబీ వేరియంట్‌ రూ.10,999గా ఉంది. రెండు ఫోన్లు రూ.1000 రాయితీతో లభిస్తున్నాయి.
* ఒకప్పుడు రూ.11,999 ఉన్న షామీ ఎంఐ ఏ2 (4జీబీ+64జీబీ)ఇప్పుడు రూ.9,999లకే అందిస్తున్నారు. 
* రూ. 6,999గా ఉన్న రెడ్‌మి6ఏ (2జీబీ ర్యామ్‌+32జీబీ) వేరియంట్‌ రూ.6,199కు, రూ.9,999గా ఉన్న రెడ్‌మి 6ప్రో (4జీబీ ర్యామ్‌+64జీబీ స్టోరేజ్‌) రూ.8,499లకే లభిస్తోంది.
* 48 మెగాపిక్సెల్‌ కెమెరా కలిగిన రెడ్‌మి నోట్‌ 7 రూ.9,999లకే లభించనుంది. ఎస్‌పై రూ.1000 డిస్కౌంట్‌ లభిస్తోంది.