హైదరాబాద్:  లైంగిక వేధింపులను తట్టుకోలేక జనగామ మైనారిటీ వెల్ఫేర్ అధికారిపై తోటి ఉద్యోగిని చెప్పుతో దాడికి ప్రయత్నించింది. గత కొంత కాలంగా శ్రీనివాస్ తనను వేధిస్తున్నారని ఆ ఉద్యోగిని తెలిపారు. ఈ  వ్యవహారం శ్రుతిమించడంతో గొడవ పెద్దదై  శ్రీనివాస్‌పై ఆమె చెప్పు విసిరారు. కానీ ఆయన, తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ తనకు సోదరి లాంటిదని, తాను ఎవరినీ వేధించలేదని  వివరించారు.