న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఆగస్టు నెలలో ఇండియా, రష్యా మార్కెట్లలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత మార్కెట్‌లో నోకియా 6.2, నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది. విడుదలకు ముందే నోకియా ఫోన్ల ఫోటోలు లీకయ్యాయి. 6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, 20 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 3,300ఎంఏహెచ్ బ్యాటరీ, 6జీబీ ర్యామ్, 64జీబీ అంతర్గత స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ల ధర రూ. 12,000 నుంచి 15,000 వరకు ఉంటుందని భావిస్తున్నారు.