భోపాల్ : కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చి మంచి ఉత్సాహం మీద ఉన్న బి‌జే‌పికి మధ్యరదేశ్ పరిణామాలు మింగుడు పడటం లేదు. మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని చెప్తున్న బీజేపీకి బుధవారం గట్టి షాక్ తగిలింది. శాసన సభలో క్రిమినల్ లా అమెండ్‌మెంట్‌ బిల్లుకు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు.
 
మధ్య ప్రదేశ్ ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ్ బుధవారం ఉదయం ఓ సవాల్ విసిరారు. తమ పార్టీ (బీజేపీ) నెంబర్ వన్ కానీ, నెంబర్ టూ కానీ ఆదేశిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని 24 గంటల్లోగా కూల్చేస్తామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఘాటుగా స్పందించారు. శాసన సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీజేపీని సవాల్ చేశారు. తమ ప్రభుత్వం మైనారిటీలో ఉందని బీజేపీ ప్రతి రోజు అంటోందని, ఏదో ఒక రోజు కూలిపోతుందని అంటోందని, నేడు శాసన సభలో జరిగిన ఓటింగ్‌లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు తన ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేశారని చెప్పారు. తన ప్రభుత్వం మైనారిటీలో లేదని తెలిపారు.
ఇక్కడ ఉన్నది కుమారస్వామి కాదు, కమలనాథ్ అన్న కాంగ్రెస్స్ నేతల ఆత్మవిశ్వాసానికి కారణం ఈ పరిణామంతో బి‌జే‌పికి తెలిసి వచ్చింది