హెచ్ ఏం డి ఏ అనుమతి తీసుకున్నారా?
హైదరాబాద్: ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పుడున్న అసెంబ్లీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా, ఇంతకీ భవనం కూల్చివేతకు హెచ్ఎండీఏ అనుమతి తీసుకున్నారా? అని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అనుమతి ఉందో.. లేదో విషయం చెప్పడానికి ఎంత ఆలస్యం ఎందుకని ప్రభుత్వం తరఫున న్యాయవాదిని నిలదీసింది. వాస్తవ పరిస్థితులపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది