ముంబయి: బీమా డబ్బుల కోసం సాక్షి తనను చంపాలని చూస్తోందని  ప్రముఖ నటి సాక్షి శివానంద్‌ సోదరి శిల్పా ఆనంద్‌, తన అక్కపై తీవ్ర ఆరోపణలు చేశారు. షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. అత్తింటివారితో కలిసి ఆమె తనను చంపేందుకు కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు. హిందీ సినిమా, బుల్లితెర నటి అయిన శిల్పా ఆనంద్‌ దాదాపు నాలుగేళ్లుగా నటనకు దూరంగా ఉంటున్నారు. అయితే తన సోదరి అత్త కట్టుకున్న భర్తనే హతమార్చిందని, బీమా డబ్బుల కోసం తన సోదరితో కలిసి తననూ చంపాలని చూస్తోందని శిల్ప ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. 

‘కొన్ని నెలల క్రితం నా సోదరి సాక్షి, ఆమె అత్త భావనలపై మా అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భావన తన భర్తను చంపేసింది. బీమా డబ్బుల కోసం నన్ను, నా తల్లిని కూడా చంపాలని చూస్తోంది. ఇందుకోసం నా సోదరి కూడా భావనతో చేతులు కలిపింది. పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనని భావన అమెరికాకు పారిపోయింది. ఆమె ఎప్పుడొస్తే అప్పుడు అరెస్ట్‌ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మరో బెస్ట్‌ ఫ్రెండే నన్ను రేప్‌ చేయించడానికి ఒకర్ని పురమాయించింది. సొంత అక్కే ఇంటి నుంచి గెంటేసింది. ఈ విషయంలో నా అభిమానులు, నాకు తెలిసినవారు కూడా సాయం చేస్తారని కోరుతున్నాను’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు శిల్ప. 

 శిల్పా ఆనంద్‌ మంచు విష్ణు నటించిన ‘విష్ణు’ సినిమాలో నటించారు.