హైదరాబాద్‌: సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ 3లో తన పేరును వాడుకోవద్దని సీజన్‌ 2 విజేత కౌశల్‌ హెచ్చరించారు  . ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ను పెట్టారు. ‘వార్నింగ్‌.. బిగ్‌బాస్‌ 3లో పబ్లిసిటీ కోసం కానీ ఇంటర్వ్యూల కోసం కానీ కౌశల్‌ ఆర్మీ అన్న పేరును వాడుకోవద్దు’ అని పేర్కొన్నారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ 3లో పాల్గొన్న శ్రీముఖి అభిమానులు ‘శ్రీముఖి ఆర్మీ’ పేరిట సోషల్‌మీడియా ఖాతాలను తెరిచారు. ఆమెకు సపోర్ట్‌ చేయాల్సిందిగా నెటిజన్లను కోరుతున్నారు. మొదలుపెట్టిన దగ్గరినుంచి బిగ్ బాస్ -3 అనేక వివాదాలకు కారణమయ్యింది. షోను ప్రసారం చేస్తున్న ఛానలుకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.