లండన్ : బ్రిటన్ ప్రధాన మంత్రి థెరీసా మే బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామాను బకింగ్‌హాం ప్యాలెస్‌లో క్వీన్ ఎలిజబెత్-2కు సమర్పించారు. బోరిస్ జాన్సన్‌ కన్సర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నిక కావడంతో థెరీసా మే రాజీనామా చేశారు.
 
థెరీసా 2016 జూలై 13న ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. యూరోపేయన్ యూనియన్ నుంచి వైతొలిగితేనే బ్రిటన్ భవిష్యత్తుకు మంచిదని నమ్మి ఆ దశగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నారు.   రాజీనామా సమర్పించడానికి ముందు ఆమె వీడ్కోలు ప్రసంగం చేశారు. తదుపరి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బోరిస్ ప్రభుత్వం సాధించే విజయం దేశం గెలుపు అని అభివర్ణించారు. మహిళా ప్రధాన మంత్రిని చూస్తున్న ప్రతి యువతి తాను సాధించగలవాటికి హద్దులేవీ లేవని తెలుసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.