కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నార్త్ పరగణాస్ జిల్లాలోని బరాక్ పోరి పట్టణంలోని బీజేపీ ఎంపీ అర్జున్‌సింగ్ ఇంటిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బాంబు విసిరారు. జగత్‌దల్ పోలీసుస్టేషను పరిధిలోని బీజేపీ ఎంపీ ఇంటిపై ఆగంతకులు బాంబు వేయడమే కాకుండా కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ ఘటనపై ఎంపీ ఫిర్యాదు మేర పశ్చిమబెంగాల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీ ఇంటి ముందు సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనలో ఎవరి హస్తముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.