తన సెలెబ్రిటి స్టేటస్సుతో పాకిస్థాన్‌ ప్రముఖ బ్యాట్స్‌మన్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ అనేక మంది యువతుల్ని మోసం చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అతడు యువతులతో ఛాటింగ్‌ చేసిన  స్క్రీన్‌ షాట్లు ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్‌గా మారాయి. పాకిస్థాన్‌ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ తన స్టార్‌డమ్‌ని ఉపయోగించి అనేకమంది యువతుల్ని మోసం చేశాడని తెలుస్తోంది. తమని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో వంచించాడని, వారితో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడని పేర్కొన్నాయి. గత ఐదారు నెలల్లోనే ఇవన్నీ జరిగాయని, ఇటీవల జరిగిన ప్రపంచకప్‌ సమయంలోనూ ఈ వ్యవహారాలను కొనసాగించాడని పేర్కొన్నాయి.అనేకమంది  యువతులతో ఇమామ్‌ కొనసాగించిన ఛాటింగ్‌ విశేషాలు సైతం అనేక స్క్రీన్‌షాట్లు వెలుగులోకి వచ్చాయి. కొందరు అభిమానులు వీటిని కొట్టిపారేయగా మరికొందరు యువతులకు మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచకప్‌లో ఇమామ్‌ మంచి ప్రదర్శన చేయలేకపోయినా అమ్మాయిల విషయంలో హిట్ అని  విమర్శలు వస్తున్నాయి.