ఖమ్మం:  ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ వ్యతిరేకంగా,  ఖమ్మం శివారులోని ప్రైవేట్‌ గెస్ట్‌హౌస్‌లో కార్పొరేటర్లు రహస్యంగా సమావేశమయ్యారు. అధికారపక్షంలో అసంతృప్తి జ్వాల తారస్థాయికి చేరుకోవటంతో  ఖమ్మం పాపాలాల్‌ తన పదవి నుంచి తప్పుకోవాలంటూ అధికార తెరాసకు చెందిన కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం శివారులోని ప్రైవేట్‌ గెస్ట్‌హౌస్‌లో కార్పొరేటర్లు రహస్యంగా సమావేశమయ్యారు. ఖమ్మం కార్పొరేషన్‌లో అధికార పార్టీకి 39 మంది సభ్యుల బలముంది. వీరిలో గురువారం జరిగిన రహస్య భేటీకి 35 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గత కొంతకాలంగా ఈ మేయర్‌ తమకొద్దంటూ అసమ్మతి గళం వినిపిస్తున్న కార్పొరేటర్లు, ఇప్పుడు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తినా,  తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచనలతో అప్పట్లో ఈ సమస్య సద్దుమణిగింది. 
ఈ సారి మాత్రం మేయర్ గద్దె దిగాల్సిందే అని పట్టు పడుతున్నారు. ఆయన వ్యవహార శైలి, నగర అభివృద్ధితో తమను భాగస్వాములను చేయకపోవడం, తెరాస కార్యకర్తలను కలుపుకొని పోవడం లేదనే కారణాలతో పాపాలాల్‌పై వరాన్తా  ఆగ్రహంతో ఉన్నారు. మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.