హైదరాబాద్‌: నాకంటే సమంత బాగా చేసిందనిపించిందని, ‘రంగస్థలం’ సినిమాను మిస్సయినందుకు బాధపడ్డానని అంటున్నారు నటి అనుపమ పరమేశ్వరన్. ఆమె కథానాయికగా నటించిన ‘రాక్షసుడు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో తాను చేయబోతున్న సినిమాల గురించి, ‘రాక్షసుడు’ సినిమా గురించి ఎన్నో విషయాలను ఆమె వివరించారు. 
‘రాక్షసన్‌’ రీమేక్‌లో నటించాలని దర్శకుడు రమేష్ నన్ను సంప్రదించారు. అయితే షూటింగ్‌లతో బిజీగా ఉండి అప్పటికి నేను సినిమా చూడలేదు. మా నాన్న‘ ఈ సినిమా చాలా బాగుంది చూడు’ అని చెప్పినప్పుడు చూశాను. వెంటనే రీమేక్‌లో నటించడానికి ఒప్పుకొన్నాను. సినిమాలో నా పాత్ర నిడివి చిన్నదే అయిన టర్నింగ్‌ పాయింట్స్‌ ఎక్కువగా ఉన్నాయి.తమిళంలో  ఒకటి, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను.

    ‘రాక్షసన్‌’ నాకు రెండో రీమేక్‌. . అయితే ‘రాక్షసుడు’ సినిమాలో పెద్దగా మార్పులు చేయలేదు. తెలుగు నేటివిటీకి తగినట్లు మాత్రమే తీర్చిదిద్దాం. సినిమా స్టోరీని డిస్టర్బ్‌ చేయలేదు.

సినిమా మొత్తం చీరలోనే ..

సినిమా మొత్తం చీరలోనే కనిపిస్తాను. నేను ఐదో తరగతి నుంచి చీర కట్టుకుంటున్నా. నాకు చీరలంటే చాలా ఇష్టం. కాబట్టి కొత్త ఫీలింగ్‌ ఏమీ కలగలేదు.

 రామ్‌చరణ్‌తో సినిమా వదులుకున్నందుకు బాధపడ్డా! 

రామ్‌చరణ్‌తో ‘రంగస్థలం’ సినిమాను మిస్సయినందుకు బాధగా ఉంది. అయితే సినిమా చూశాక నేను చేయడం కంటే సమంత బాగా చేశారు అనిపించింది. డేట్లు కుదరక సినిమాను ఒప్పుకోలేకపోయాను కానీ, మరో కారణమేమీ లేదు. నో కామెంట్స్‌క్రికెటర్ కే.ఎల్‌ రాహుల్‌తో డేటింగా? ఈ వార్తలు ఎప్పుడు వచ్చాయ్‌? అయినా దీని గురించి మాట్లాడదలచుకోలేదు. నో కామెంట్స్‌. ఈ విషయంలో చెప్పడానికి ఏమీ లేదు. అది మాత్రం అడగొద్ధు.