ముంబయి:  ఇంటర్‌కనెక్షన్‌ పాయింట్లు కల్పించని అంశంపై 2016లో ట్రాయ్‌(టెలికామ్‌ రెగ్యులేటరీ ఆథారిటీ అఫ్‌ ఇండియా)లోనమోదైన  ఫిర్యాదు ఆధారంగా మొబైల్ నెట్‌వర్క్‌కు సంబంధించి భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా కంపెనీలు రిలయన్స్‌ జియోలను    ట్రాయ్‌  విచారించి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియాపై సంయుక్తంగా రూ.3,050 కోట్ల జరిమానా విధించింది. తాజాగా ఆ జరిమానాకు ఆమోదం తెలిపినట్లు టెలికాం విభాగంలోని ప్రభుత్వ ప్యానెల్‌ బుధవారం వెల్లడించింది. ఈ ఫిర్యాదులో 2016లో సదరు సంస్థలు జియోకు ఇంటర్‌కనెక్షన్‌ పాయింట్లను మూడుకి తగ్గించి వినియోగదారులకు వ్యతిరేకంగా,  టెలికాం సంస్థల మధ్య ఉండే పోటీని అరికట్టేందుకు ప్రయత్నించినట్టు ట్రాయ్‌ పేర్కొంది. దీన్ని బుధవారం పరిశీలించిన డిజిటల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ రెండు కంపెనీలపై జరిమానాకు అమోదం తెలపాయని భారత టెలికాం విభాగం తెలిపింది.  ఈ చర్యను భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా ఖండించాయి. ఇప్పటికే భారీ ఒత్తిడితో కొనసాగుతున్న తమ కంపెనీలకు ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారిందని, ఈ జరిమానా నుంచి బయటపడడానికి చట్టపరంగా తమకున్న పరిధిలో అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని సదరు కంపెనీలపై అధికారులు వెల్లడించారు. రిలయన్స్‌ జియోరాకతో భారతదేశంలో ప్రధాన మొబైల్స్‌ నెట్‌వర్క్‌గా ఉన్న ఈ రెండుకంపెనీల ఆదాయం భారీ స్థానంలో పతనమైంది. అతి చౌకైన టారీఫ్‌ ప్లాన్లతో అంతర్జాల వాడకంలో జియో విప్లవాన్ని సృష్టించి, ఎప్పటినుంచో సర్వీసులు అందిస్తున్న భారత దేశపు అతి పెద్ద టెలికాం కంపనీలకు సవాలు విసిరిన సంగతి తెలిసిందే