హైదరాబాద్‌: నటన నుంచి తానెప్పుడైనా రిటైర్‌ అవ్వచ్చని అంటున్నారు ప్రముఖ యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఆయన నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నేను ఎప్పుడైనా నటనకుఆపేయవచ్చు . నాకుఇంతకన్నా ఆసక్తికరంగా ఏదన్నా చేయాలనిపించినా, సినిమాలు  బోర్‌ కొట్టినా వెంటనే యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తాను’ అన్నారు. మరి పెళ్లెప్పుడు చేసుకుంటారు? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ఇప్పుడే కాదు. మరో ఐదేళ్లు ఆగాలి. నాకు 35 వచ్చాక చేసుకోవాలని అనుకుంటున్నా’ అన్నారు. 

‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో ముద్దు సన్నివేశాలపై స్పందిస్తూ ఈ సన్నివేశాలతో మేం ఇబ్బందిపడినా ఫర్వాలేదు. కానీ, తెరపై చూసే ప్రేక్షకులకు మాత్రం మేం ఇబ్బందిపడినట్లు తెలీకూడదు. నా తర్వాతి సినిమాలో ఎలాంటి ముద్దు సన్నివేశాలు లేవులెండి’ అని చమత్కరించారు విజయ్‌. ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం శుక్రవారం దేశవ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు రానుంది.