బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో ఈనెల 29వ తేదీ సోమవారం 10 గంటలకు మెజారిటీ నిరూపించుకున్న తరువాత  ఆర్థిక బిల్లు ఆమోదించనున్నట్టు కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యడియూరప్ప తెలిపారు. ఇవాళ సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ఇతర నేతలతో చర్చించిన అనంతరం మంత్రివర్గ విస్తరణ చేపడతానని చెప్పారు. అవసరమైతే శనివారంనాడు ఢిల్లీ బయలుదేరి వెళ్తానని, ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. పీఎం కిసాన్ పథకంతో పాటు, లబ్ధిదారులకు రూ.2000 చొప్పున రెండు ఇన్‌స్టాల్‌మెంట్స్ అందజేస్తామని అన్నారు.