హైదరాబాద్: పెళ్లై పిల్లలు ఉన్నా.  అక్రమ సంబందం పెట్టుకొని, జల్సాలకోసం ప్రియుడితో 

కలిసి బంధువుల ఇంటికే కన్నం వేసింది.కుష్బూ అలియాస్ నక్కీకి  పెళ్లై పిల్లలు 

ఉన్నారు.  తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆకాడమీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న 

వినయ కుమారి కి కుష్బూ బంధువు.  ఈ నెల 17న సాయంత్రం కుష్ బూ వినయ ఇంటికి 

వెళ్లింది. వారిని మాటల్లో పెట్టి నిమ్మరసంలో మత్తుమందు కలిపి వినయతోపాటు ఆమె 

కూతురుకి ఇచ్చింది. మత్తుమందు కలిపిన నిమ్మరసం తాగిన తాగిన వెటనే ఇద్దరూ 

అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిద్దరినీ కుష్బూ స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి 

చికిత్స చేయించింది. నాలుగు రోజులు వారికి సపర్యలు చేసింది. వారు ఈ నెల 23వ 

తేదీన ఆసుపత్రి నుండి డిష్చార్జి అయిన తరువాత ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఉన్న 53 

తులాల బంగారం, డబ్బు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి 

దిగిన పోలీసులు  అసలు విషయం రాబట్టారు. 
ఈ నెల 17వ తేదీ రాత్రి కుష్బూ వినయ ఇంట్లో వారికి మత్తుమందు ఇచ్చి వారిని 

ఆసుపత్రికి తీసుకెళ్లిన తరువాత  ప్రియుడు సూర్య, వంశీ వినయ్ కుష్బూ దగ్గర ఉన్న   

తాళాలు ఉపయోగించి  ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు దొంగతనం చేశారు.   
 చోరీ చేసిన సమయంలో వారు మాట్లాడిన కాల్ డేటా సహాయంతో ఈ చిక్కుముడిని 

ఛేదించారు. ఇంట్లో చోరీ చేసిన వస్తువులను ముగ్గురు పంచుకున్నారని గుర్తించి మొత్తం 

బంగారం, డబ్బును పోలీసులు రెండు రోజుల్లోనే రికవరీ చేశారు.