గుంటూరు: బీజేపీ నేత సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలన్నదే బీజేపీ లక్ష్యం అని అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో అధికారం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆయన చెప్పారు. బీజేపీ నిబద్దతతో, నిజాయితీగా పనిచేస్తుంటే, మిగతా పార్టీలు కరప్షన్‌తో పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. కుటుంబ పాలన నియంత్రణే బీజేపీ సిద్ధాంతం అని పేర్కొన్నారు. సీఎం జగన్ అధికారాన్ని వినమ్రంగా స్వీకరించాలని వీర్రాజు హితవు చెప్పారు. కేసులు పెట్టే సంస్కృతి, అధికారుల్ని శాసించే సంస్కృతి మంచిది కాదని అన్నారు. ఓట్లు వేయకున్నా మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు.