ముంబై: జపనీస్ కార్‌మేకర్ నిస్సాన్ మోటార్స్ 1700 మంది ఉద్యోగులకు ఒకేసారి 

వేటువేయనుంది. నిస్సాన్ లాభాలు ఇటీవల దారుణంగా పడిపోయాయి. దశాబ్దకాల 

కనిష్టానికి చేరుకున్నాయి. దీంతో ఖర్చులు తగ్గించుకునే చర్యలు ప్రారంభించిన నిస్సాన్ 

ప్రపంచవ్యాప్తంగా 12,500 మందిని తొలగించాలని నిర్ణయించింది. వీరిలో భారత్‌లోని 

1700మంది ఉద్యోగులు ఉన్నారు. త్వరలోనే వీరికి పింక్ స్లిప్‌లు ఇవ్వనున్నట్టు 

సమాచారం. ఇప్పటికే 6,400 మంది ఉద్యోగులను సెలవుపై వెళ్లాల్సిందిగా నిస్సాన్ 

ఆదేశించింది.  ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో గతేడాది సెప్టెంబరులోనే నిస్సాన్ 

మోటార్ ఇండియా ‘ఎంప్లాయీ వాలంటరీ సెపరేషన్ స్కీం’ను ప్రకటించింది.