లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాలో అసభ్యంగా,
రెచ్చగొట్టేలా పాట పాడిన ఓ గాయకుడిని పోలీసులు అరెస్టు
చేశారు. గోండా జిల్లా బంద్‌రాహ్ గ్రామానికి చెందిన
గాయకుడు వరుణ్ బాహర్ అసభ్యంగా, రెచ్చగొట్టేలా పాట
పాడారని  కేసు నమోదు చేసి అతన్ని పోలీసులు అరెస్టు
చేశారు. ‘‘జో నా బోలే జై శ్రీరాం, ఉస్కో భేజో ఖబరస్థాన్’’
అంటూ వరుణ్ బాహర్ పాడిన పాట వీడియో సోషల్
మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పొలిటికల్ ఎనలిస్టు
తషీన్ పూనావాలా ఈ వీడియోను ఢిల్లీ పోలీసులకు జత
చేస్తూ ట్వీట్ చేస్తూ, దీనిపై కేసు నమోదు చేయాలని
కోరారు. ఈ పాట పాడిన గాయకుడిపై ఐపీసీ సెక్షన్ 153
(ఎ), 295(ఎ) లపై కేసు నమోదు చేయాలని తషీన్
కోరారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే తాను
ప్రధాని మోదీ ఇంటి ముందు ఈ పాట వీడియో ప్రదర్శించి
నిరసన తెలుపుతానని తషీన్ పేర్కొన్నారు.వరుణ్ బాహర్
గతంలోనూ పలు వివాదాస్పద పాటలు పాడారని కేసులు
నమోదయ్యాయి.  జై శ్రీరామ్ నినాదం చుట్టూ అనేక
వివాదాలు ముసురుకుంటున్న నేపధ్యంలో ఈ అరెస్టు
జరగటం గమనార్హం.