సీబీఐ అంతర్గత కలహాలకు కారణమైన సతీష్‌ బాబు సాన

దిల్లీ: మహారాష్ట్రాకు చెందిన మాంసం ఎగుమతిదారుడు మొయిన్‌ ఖురేషీ అక్రమాస్తుల కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న హైదరాబాద్‌కు చెదిన సాన సతీష్‌ బాబును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఖురేషీ అక్రమాస్తుల కేసులో సతీశ్‌ సాక్షిగా ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన దిల్లీలోని ఓ కీలక ప్రదేశంలో ఉండగా ఈడీ అధికారులకు చిక్కారు. మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం ప్రకారం ఇతడిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. 


మొయిన్‌ అక్రమార్జనలో సతీష్ ప్రమేయం కూడా ఉందని   ఈడీ, సీబీఐ వివిధ దశల్లో విచారిస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు అధికారులకు  మొయిన్ ఖురేషి కేసులో తనను విచారణ నుంచితప్పించాల్సిందిగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. ఈ వ్యవహారం సీబీఐలో అంతర్గత కలహాలు ఏర్పడటానికి దారి తీసింది. ఈ క్రమంలోనే సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, డిప్యూటీ డైరెక్టర్‌ రాకేష్ అస్థానా  తమ పదవులును వదులు కోవాల్సి వచ్చింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా ఈ వివాదంలో ఇరుక్కోవాల్సి వచ్చింది.  గతంలో ఈ వ్యవహారంతో అనేక మంది అధికారులను బదిలీ చేశారు. ఈ ఆరోపణలవల్ల సీబీఐ ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతిని, దేశమంతా పెనుదుమారం చెలరేగటం తెలిసిందే