హైదరాబాద్‌:  మహేష్ బాబు కొత్త వ్యాపారం మొదలు పెట్టనున్నట్టు తెలిసింది. ఇటీవల సినిమా స్టార్స్  సినిమాలతో పాటు రాక రకాల వ్యాపారాలు చేస్తున్నారు.   అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఇటీవల గచ్చిబౌలిలో విలాసవంతమైన ‘ఏఎమ్‌బీ’ సినిమాస్‌ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన త్వరలో సొంతంగా దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ‘మిమ్మల్ని ఉత్సాహపరిచే  విషయాన్ని పంచుకుంటున్నాం. ప్రస్తుతం మేం ఈ పనిలోనే  ఉన్నాం. సీక్రెట్‌ను బయటపెట్టేందుకు ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి’ అంటూ http://www.spoyl.in/mahesh-babu అనే వెబ్‌సైట్‌ను మహేశ్‌ బృందం పోస్ట్‌ చేసింది. దీన్ని మహేశ్‌ తిరిగి షేర్‌ చేశారు. ఇందులో మూడు రోజులు కౌంట్‌డౌన్‌ ఉంచారు. ఈ పేజ్‌  కింది భాగంలో రకాల  దుస్తులు,  బ్రాండ్‌లు ఉంచారు. దీన్ని బట్టి మరో మూడు రోజుల్లో ఓ  ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.